ఇసుక లారీ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ స్వాధీనం

Jul 1 2026 5:14 AM | Updated on Jul 1 2026 5:14 AM

కబ్జా చెరవీడిన గోపాయకుంట

కొడంగల్‌ రూరల్‌: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రాకు చెందిన లారీ సోమవారం రాత్రి అధిక లోడ్‌తో కొడంగల్‌లోని ఓ ప్రైవేటు డంపింగ్‌ యార్డులో ఖాళీ చేసేందుకు డ్రైవర్‌ తీసుకొచ్చాడు. ఈ క్రమంలో కొడంగల్‌ లారీ అసోసియేషన్‌ సభ్యులు లారీ ఇసుకను కొడంగల్లో ఖాళీ చేస్తున్నారని పోలీసులకు సమాచా రం అందించారు. పోలీసులు డంపింగ్‌యార్డుకు చేరుకొని వివరాలు సేకరిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీస్‌స్టేషరన్‌కు తరలించారు. మంగళవారం ఆర్డీఓ అధికారు లు వచ్చి లారీని సీజ్‌ చేశారని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

హనుమాన్‌ చాలీసా పారాయణం

ధారూరు: మండల కేంద్రంలోని గంజిబాయి సమీపంలోని ధారూరు మందిరంలో మంగళవారం రాత్రి హనుమాన్‌ చాలీసా కొనసాగింది. గ్రామంలోని భక్తులందరూ హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు. గత 14 వారాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రయాణికుడి

సెల్‌ఫోన్‌ చోరీ

పూడూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ చోరికి గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పరిగి నుంచి హైదరాబాద్‌కు బయలు దేరింది. అందులోని ఓ ప్రయాణికు డి సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. బస్టాండ్‌లో బస్సు ఎక్కే సమయంలో చోరీ జరిగిందని బాధితుడు తెలిపారు. టిక్కెట్‌ తీసేందుకు డబ్బులు తీస్తుండగా సెల్‌ఫోన్‌ కనిపించలేదని తెలిపాడు. డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బస్సు ఆపాడు. బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేశారు. సెల్‌ఫోన్‌ దొరక్క పోవడంతో ప్రయాణికులను ఎక్కించి బస్సును పంపించారు.

నిందితులను వెంటనే

అరెస్టు చేయాలి

ప్రజాసంఘాల నాయకులు

తాండూరు టౌన్‌: యువకుడి కిడ్నాప్‌, హత్యాయత్నం కేసులో మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ పలు ప్రజాసంఘాల నాయకులు మంగళవారం తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్యకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల పెద్దేముల్‌ పరిధిలో రాంప్రసాద్‌ ముదిరాజ్‌ అనే యువకున్ని కాంగ్రెస్‌ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శోభారాణి, ఆమె కుమారుడితో పాటు పలువురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి, హత్యాయత్నానికి పాల్పడిన విషయం విధితమే. ఈ కేసులో శోభారాణిని మాత్రమే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని, అయితే మిగితా నిందితులను అరెస్టు చేయకపోవడం వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగరాదని, వెంటనే నిందితులను అరెస్టు చేయడంతో పాటు, ఉపయోగించిన మూడు వాహనాలను సీజ్‌ చేయాలని టీఎస్‌ఎంహెచ్‌పీసీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ వాహబ్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, బాలయ్య, షౌకత్‌ తదితరులు డిఎస్పీని కోరారు.

మొయినాబాద్‌: పదేళ్లుగా కబ్జాకు గురైన గోపాయకుంట కబ్జా చెరవీడింది. కుంటను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మున్సిపల్‌ పరిధిలోని ముర్తూజగూడ సర్వేనంబర్‌ 451లో గోపాయకుంట ఉంది. పదేళ్ల క్రితం కొందరు అక్రమార్కులు కుంటను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై కౌన్సిలర్‌ అవురం విక్రంరెడ్డితోపాటు స్థానికులు రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు సర్వేచేసి కుంటలో చేపట్టిన నిర్మాణాలను తొలగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement