పరిగి: వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కౌన్సిలర్ శివనోళ్ల చంద్రకళ అన్నారు. మంగళవారం పట్టణంలోని 4వ వార్డులో పలు అభివృద్ధి పనులు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డులోని సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తానని అన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలనీలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాను నిరంతరం పనిచేస్తానని అన్నారు. పార్టీలకు అతీతంగా కాలనీ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం 4వ వార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. దశల వారీగా కాలనీలోని సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజీ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలోనే కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతానన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


