తాండూరు రూరల్: పాఠశాల, కళాశాల వద్ద ఆడపిల్లలను ఎవరైన వేధిస్తే కఠిన చర్యలు తప్పవని కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్ అన్నారు. మంగళవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. బాలికలను వేధించి కేసుల్లో ఇరుక్కోవద్దని హెచ్చరించారు. అనంతరం పోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిర్మూలన, డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి, షీ టీం ఇన్‌చార్జి ఏఎస్‌ఐ శేఖర్, ఏఎస్‌ఐ పవన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


