డీఎస్పీకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు
తాండూరు టౌన్: అస్తవ్యస్తంగా తయారైన తాండూరు పట్టణ ట్రాఫిక్ వ్యవస్థను సక్రమంగా కొనసాగించేందుకు వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేయాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం అన్నారు. ఈమేరకు మంగళవారం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు పార్టీ పట్టణశాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని శివాజీచౌక్, వినాయక్ చౌక్, గాంధీ చౌక్, బస్టాండు, రైల్వే స్టేషన్ రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారిందన్నారు. అక్రమంగా పలువురు రోడ్డును ఆక్రమించుకోవడంతో రోడ్డు మార్గం ఇరుకుగా మారిందన్నారు. అలాగే ట్రాఫిక్‌ను నియంత్రించుటకు సరిపోయే సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కిరణ్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు కృష్ణ, ప్రకాష్, బిచ్చప్ప, చందు, బస్వరాజ్, బబ్లు తదితరులు ఉన్నారు.


