నేడు పాఠ్య, నోటు పుస్తకాల పంపిణీ
అమావాస్య కావడంతో నామమాత్రంగా హాజరు
మొదటి రోజు సరదాగా గడిపిన విద్యార్థులు
అల్పాహార పథకం ప్రారంభం
వికారాబాద్: వేసవి సెలవుల అనంతరం సోమ వారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆదివారం వరకు ఆటపాటలతో గడిపిన చిన్నారులు ఉదయం బడిబాట పట్టారు. మొదటి రోజు, అందులోనూ అమావాస్య కావడంతో 50శాతం లోపే హాజరయ్యారు. మన ఊరు – మన బడి, అమ్మా ఆదర్శ పాఠశాలల పథకం కింద స్కూళ్లను అభివృద్ధి చేశారు. గతంతో పోలిస్తే సమస్యలు అంతగా కనిపించలేదు. తొలి రోజు విద్యార్థులు బడి ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేయడం, అలంకరించడం వంటి పనుల్లో మునిగి పోయారు. నేడు(మంగళవారం) పాఠ్య, నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వపాఠశాలలు ఉండగా 80వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కోవిద్యార్థికి రెండు జతల చొప్పున 1.5 లక్షల యూనిఫారాలు అందజేయాల్సి ఉంది. ఇంకా ఇవి సిద్ధం కాలేదు. 5,27,290 పాఠ్యపుస్తకాలు, 5,21,904 నోటు పుస్తకాలు స్కూళ్లకు చేరాయి. పలు పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఆనందంగా టిఫిన్ చేయ డం కనిపించింది.
పాఠ్యపుస్తకాలు అందజేత
దౌల్తాబాద్: మండలంలో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు అంతంతమాత్రమే హాజరయ్యారు. ఉద యం విద్యార్థులకు టిఫిన్ అందజేశారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు పంపిణీ చేశారు. దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాలలో 80 మంది విద్యార్థులు ఉండగా 30 మంది వచ్చారు.
40శాతమే హాజరు
యాలాల: మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలలో 40 మందికి పైగా విద్యార్థులు ఉండగా, కేవలం 15 మంది మా త్రమే హాజరయ్యారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించారు. మండల వ్యాప్తంగా సుమారు 4,600 మంది విద్యార్థులు ఉండగా 40 శాతం మంది మాత్రమే హాజరైనట్లు ఎంఈఓ మహిపాల్‌రెడ్డి తెలిపారు.
సమస్యలతో స్వాగతం
సందడిగా పాఠశాలలు
ఆటపాటలతో..
ధారూరు: మొదటి రోజు విద్యార్థులు ఇళ్ల నుంచి ఉత్సాహంగా పాఠశాలలకు బయలుదేరారు. రోజంతా ఆటపాటలు, క్రీడలతో సరదాగా గడిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమై వారితో కలిపి ఆటల పోటీల్లో పాల్గొన్నారు. పుస్తకాలను పంపిణీ చేశారు.
ఘన స్వాగతం
నవాబుపేట: మండలంలోని 11 ఉన్నత, 5 ప్రాథమికోన్నత, 26 ప్రాథమిక, ఒక కేజీబీవీ, జ్యోతిబాపూలే, ఆదర్శ పాటశాలలు ఉన్నాయి. వీటిలో ఏటా దాదాపపు 2,300 మంది వరకు చదువుకుంటున్నారు. సోమవారం పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుఽలకు ఘనంగా స్వాగతం పలికారు. మొదటి రోజు చిన్నారులు ఉత్సహంగా గడిపారు.
పండుగలా ప్రారంభమైన పాఠశాలలు


