మోమిన్‌పేట తహసీల్దార్‌గా మునీరొద్దీన్‌ | - | Sakshi
Sakshi News home page

మోమిన్‌పేట తహసీల్దార్‌గా మునీరొద్దీన్‌

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

మోమిన్‌పేట: మండల తహసీల్దార్‌గా మునీరొద్దీన్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్‌ రవీందర్‌ దోమకు బదిలీ ఆయ్యారు. కలెక్టరేట్‌ లో విధులు నిర్వహిస్తున్న మునీరొద్దీన్‌ బదిలీ పై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

దోమ తహసీల్దార్‌గా రవీందర్‌

దోమ: మండల నూత న తహసీల్దార్‌గా రవీందర్‌ సోమవారం బా ధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహసీల్దార్‌ గోవిందమ్మ వికారాబాద్‌ ఆర్డీఓ కార్యాలయ డీఏఓగా బదిలీ అయ్యారు. మోమిన్‌పేటలో విధులు నిర్వహిస్తున్న రవీందర్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెవెన్యూ సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సకాలంలో పరిష్కరిస్తాం

ఎస్పీ స్నేహమెహ్ర

అనంతగిరి: ప్రజావాణికి వచ్చిన ఫిర్యా దులను సకాలంలో పరిష్కరిస్తామని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపా రు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాలకు చెందిన బాధితులు ఎస్పీని కలిసి సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాధితులకు సత్వర నాయం జరిగేలా చూస్తామన్నారు.

పెండింగ్‌ కేసులను..

పెండింగ్‌ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ స్నేహమెహ్ర పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలోని సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు జానయ్య, శ్రీనివాస్‌, అంజయ్య, శ్రీనివాస్‌, నర్సింగ్‌ యాదయ్య,వీరేష్‌ పాల్గొన్నారు.

యోగా డేనుఘనంగా నిర్వహించాలి

అనంతగిరి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర మెడికల్‌ సెల్‌ కన్వీనర్‌ కొప్పుల రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దీన్‌దయాల్‌ బాంగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కమిషన్‌ యోగాను సామర్థ్య ఆధారిత వైద్య విద్య పాఠ్య ప్రణాళికలో ఒక ముఖ్యమైన అంశంగా చేర్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలలు ప్రతి సంవత్సరం విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య నిపుణుల భాగస్వామ్యంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఎన్‌ఎంసీ సూచిస్తోందన్నారు. కార్యక్రమంలో సభ్యులు డాక్టర్‌ స్వప్న, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

షాట్‌పుట్‌ విభాగంలో

సాయికిరణ్‌కు గోల్డ్‌మెడల్‌

దుద్యాల్‌: మండలంలోని హస్నాబాద్‌కు చెందిన అల్వాల్‌ సా యి కిరణ్‌ షాట్‌పుట్‌ విభాగంలో బంగారు పతకం సాధించారు. పంజాబ్‌ రాష్ట్రం లుదియానలో అండర్‌ – 20 షాట్‌పుట్‌ పోటీలు జరిగాయి. తెలంగాణ తరఫున షాట్‌పుట్‌ విభాగంలో సాయి కిరణ్‌ పాల్గొని 17.71 మీటర్ల దూరం విసిరి ప్రతిభ చాటాడు. దీంతో బంగారు పతకం వరించింది.

నేడు జాబ్‌ మేళా

పరిగి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎస్‌కేఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నేడు(మంగళవారం) జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రానిక్‌ కంపెనీలో పని చేసేందుకు 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు, పదో తరగతి ఆపై చదివిన వారు హాజరుకావాలన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement