● హౌసింగ్ శాఖ రాష్ట్ర టెక్నికల్ అసిస్టెంట్ ఈశ్వరయ్య ● పెద్దేముల్ మండలంలో పర్యటన
తాండూరు రూరల్: తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని హౌసింగ్ శాఖ రాష్ట్ర టెక్నికల్ అసిస్టెంట్ ఈశ్వరయ్య అన్నారు. సోమవారం పెద్దేముల్ మండలం చైతన్య నగర్, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ ఖలీమొద్దీన్, ఏఈ ఆకాంక్ష, ఎంపీడీఓ తిరులమస్వామి, ఎంపీఓ రతన్‌సింగ్, సర్పంచ్ గౌరమ్మ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మరో ఐదుగురు అగ్నివీరులు
ఉద్యోగానికి ఎంపికై న
బండవెల్కిచర్ల యువకులు
కుల్కచర్ల: అగ్నివీర్ ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో మండల యువత సత్తాచాటుతున్నారు. వారం రోజుల క్రితం 17మంది యువకులు అగ్నివీర్‌కు ఎంపికవగా ఇందులో బండవెల్కిచర్లకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఇదే ఊరికి చెందిన మరో ఐదుగురు సెలెక్టయ్యారు. వీరిలో రమేశ్, మల్లేశ్, శ్రీకాంత్, శివకుమార్, గణేశ్ ఉన్నారు. గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి వెంకటేశ్ యువకులకు తర్ఫీదునిస్తూ తన సొంత డబ్బులతో వీరికి అవసరమైన సామగ్రిని అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారని స్థానికులు తెలిపారు. యువకుల ఎంపికపై సర్పంచ్ మడుగు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, పాంబండ ఆలయ మాజీ చైర్మన్ కోట్ల మైపాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు. ఈనెల 20వరకు విడుదల కానున్న ఫలితాల్లో తమ గ్రామానికి చెందిన మరికొంత మంది ఉద్యోగాలు సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
అధిక ఫీజులను నియంత్రించాలి
అనంతగిరి: ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజుల వసూలును వెంటనే నియంత్రించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఈఓ అబ్దుల్ ఘనికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ జాయింట్ సెక్రటరీ శివ, నాయ కులు సాయిచరణ్, మధు, శ్రీకాంత్ పాల్గొన్నారు.


