ధారూరులో తడిసిన ధాన్యం బస్తాలు
అనంతగిరి: వికారాబాద్‌లో జలమయమైన రోడ్డు
దోమ – బాస్‌పల్లి మార్గంలో విరిగిపడిన చెట్టు
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. శనివారం సాయంత్రంఏకధాటిగా కురిసింది. వానాకాలం సాగుకు సిద్ధమైన రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. వరి ధాన్యం చేతికొచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించకపోవడం, కళ్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. దోమ – బాస్‌పల్లి మార్గంలో ్ఢ పెద్ద చెట్టు విరిగి పడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.వికారాబాద్‌లో రోడ్లపై నీరు నిలిచింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ధారూరు మండలం మున్నూరు సోమారం గ్రామ కొనుగోలు కేంద్రంలో ఆరుబయట నిల్వ చేసిన జొన్నల బస్తాలు తడిసిపోయాయి. సకాలంలో గోదాంలకు తరలించపోవడమే కారణమని రైతులు ఆరోపించారు. పరిగిలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. శనివారం సంతకావడంతో రైతులు, కొనుగోలు దారులు ఇబ్బందులు పడ్డారు.
– సాక్షి నెట్‌వర్క్
దుద్యాల్: పోలేపల్లిలోని ఓ ఇంట్లోకి చేరిన వర్షపు నీరు
పరిగి మార్కెట్‌లో వ్యాపారుల పాట్లు
పరిగిలో కురుస్తున్న వర్షం


