తహసీల్దార్ల బదిలీ | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్ల బదిలీ

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

అనంతగిరి: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ దీపక్‌ తివారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కోట్‌పల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆనంద్‌రావును కోట్‌పల్లికి బదిలీ చేశారు. మోమిన్‌పేట తహసీల్దార్‌ రవీందర్‌ను దోమ మండలానికి, ఇక్కడ పనిచేస్తున్న గోవిందమ్మను వికారాబాద్‌ ఆర్‌డీఓ కార్యాలయ డీఏఓగా బదిలీ చేశారు. కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న మునీరొద్దీన్‌ను మోమిన్‌పేటకు బదిలీ చేశారు.

శుభ్రత తప్పనిసరి

ఎంఈఓ మహిపాల్‌రెడ్డి

యాలాల: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణలో శుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఎంఈఓ మహిపాల్‌రెడ్డి ఆదేశించారు. శనివారం యాలాలలోని పీఎం శ్రీ బాలురు ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లను పరిశుభ్రతంగా ఉంచాలన్నారు. ఉదయం అల్పాహార పథకం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్‌ హరేకృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలో అన్ని పాఠశాలల్లో అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. గతేడాది నాలుగు కాంప్లెక్స్‌ పరిధిలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను సంతృప్తికరంగా విధులు నిర్వహించిన మధ్యాహ్న భోజన ఏజెన్సీల మహిళలను ఎంఈఓ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంలు కృష్ణయ్య, శాంతప్ప, సిద్రామేశ్వర్‌, శివకుమార్‌, మహేష్‌, వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement