విద్యుదాఘాతంతో గేదె మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో గేదె మృతి

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

లాలాగూడ వర్క్‌షాపులో రైల్వే జీఎం తనిఖీ

దుద్యాల్‌: మండలంలోని రోటిబండ తండాలో విద్యుత్‌ వైర్లు తగిలి గేదె మృతి చెందింది. తండాకు చెందిన సేవ్యా నాయక్‌ వారం రోజుల క్రితం రూ.90 వేలు వెచ్చించి గేదెను కొనుగోలు చేశాడు. ఎప్పటిలాగే ఉదయం తన పొలంలో మేతకు వదిలాడు. ఇదురు గాలులకు పొలంలోని విద్యుత్‌ వైర్లు కిందికి జారాయి. వాటిని గేదె తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు సేవ్యానాయక్‌ కోరారు.

డీసీఎం బోల్తా..

600 కోళ్ల మృత్యువాత

పరిగి: కోళ్ల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడిన ఘటన మండలంలోని చిగురాల్‌పల్లి సమీపంలో చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందపూర్‌ పౌల్ట్రీ ఫాం నుంచి విజయవాడకు కోళ్లను రవాణా చేస్తున్న డీసీఎం శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. వాహనం బోల్తా పడటంతో 600లకు పైగా కోళ్లు మృతి చెందాయి. లక్నాపూర్‌ రోడ్డు మరమ్మతు పనులు జాప్యం కావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అధికారులు స్పందించి మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌నాయక్‌

కొడంగల్‌ రూరల్‌: యువతకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో అవసరమని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. శనివారం పట్టణంలోని వీబీఆర్‌ కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇనిస్టిట్యూట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భీమరాజ్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరికీ కంప్యూటర్‌ తప్పని సరిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ సభ్యుడు ఆసిఫ్‌ఖాన్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్‌, ఫ్యాకల్టీ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

మహాసభలను

జయప్రదం చేయాలి

పరిగి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య పిలుపునిచ్చారు. శనివారం పరిగి పట్టణంలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, కార్మిక సమస్యలపై చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రయ్య, నాయకులు సత్తయ్య, మొగులయ్య, రమేష్‌, శివ, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ శనివారం లాలాగూడ క్యారేజ్‌ వర్క్‌షాప్‌లో తనిఖీ నిర్వహించారు.వర్క్‌షాప్‌లోని నిర్వహణ, మరమ్మతు కేంద్రాలను పరిశీలించారు. చీఫ్‌ వర్క్‌షాప్‌ మేనేజర్‌ సుమన వర్క్‌షాప్‌ పనితీరును జీఎంకు వివరించారు. ఈ తనిఖీల్లో సీనియర్‌ రైల్వే అధికారులు జీఎంతో పాటు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌ను స్క్రాప్‌ రహిత (వ్యర్థాలు లేని) యూనిట్‌గా మారుస్తూ .. అక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలను ప్రశంసించారు. భారతీయ రైల్వేలలోని అత్యుత్తమ కోచ్‌ నిర్వహణ కేంద్రాలలో లాలాగూడ ఒకటని చెప్పారు. సిబ్బంది విధినిర్వహణ వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement