న్యూస్‌రీల్
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
ఇది రైతు ప్రభుత్వం
తాండూరు: ‘సాధారణంగా రైతులు ఖరీఫ్, రబీ సీజన్లు ముగిశాక పొలాలను అలాగే వదిలేస్తారు.. మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యే వరకు భూములను దున్నకుండా వదిలేస్తారు.. దీంతో కలుపు, గడ్డి జాతి మొక్కలు పెరిగి నీరు, ఇతర పోషక పదార్థాలను గ్రహించి భూమి సత్తువ లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి.. దీని వల్ల భూ సారం మందగించి భూమి లోపల పొరల నుంచి నీరు గ్రహింపబడి ఆవిరైపోతాయి. తీవ్రత అధికమయ్యే అవకాశం ఉందని’ జిల్లా వ్యవసాయాధికారి టీ రాజరత్నం అన్నారు. వేసవిలో భూముల చదును చేసుకునే విధానంపై ఆయన సలహాలు సూచనలు..
దుక్కులు దున్నక పోతే..
వేసవిలో వ్యవసాయ పొలాలను దుక్కులను దున్నక పోతే ముడి పోషకాల కొరత ఏర్పడుతుంది. అత్యధిక మోతాదులో రసాయన ఎరువులు వేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచి మే నెలలో అడపాదడపా కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలి. మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. తగిన సమయంలో పంట విత్తు కోవాలన్నప్పుడు రైతులకు భూములు తయారుగా ఉండాలంటే ఈ వేసవిలో లోతైన దుక్కులు అవసరం ఎంతైనా ఉంది. రుతుపవనాల ఆరంభానికి ముందే భూమిని దున్ని ఉంచుకోవడం వల్ల తొలకరి వర్షాలు పడగానే పెళ్లలు మెత్తబడి నీరు త్వరగా భూమిలోకి ఇంకుతుంది. దీని వల్ల భూమి లోపలి పొరల్లో నీరు నిక్షిప్త సామర్థ్యం పెరగడంతో పాటు మొలక శాతం బాగుంటుంది.
దున్నే విధానం
లోతైన దుక్కులు వాలుకు అడ్డంగా చేయడం వల్ల వర్షపు నీరు పారుదల కాకుండా భూమి లోతుకు చేరుతుంది. ఒక వేళ వాలుకు అనుకూలంగా దున్నినట్లయితే నేల విపరీతమైన కోతకు గురికావచ్చు. సాళ్ల వెంట పడిన వర్షపు నీరు ప్రవహించి సారవంతమైన మట్టినంత ఒరవడికి గురిచేసి భూమిని నిస్సారంగా మారుస్తుంది. అడ్డంగా దున్నడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
దిగుబడి మందగింపుపై..
సాధారణంగా భూమి పొరలు గట్టిబడి, దళసరి గోడలాగ తయారవడం వల్ల మొక్కల వేళ్లు లోనికి చొచ్చుకొని పోలేక, భూమి లోపల పోషక పదార్థాలు, నీరు, ఇతర ఖనిజ లవణాలును పొందక పోవడంతో పంటల ఆరోగ్యం దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతాయి. నివారణ కోసం రైతులు వేసవిలో దుక్కులను లోతుగా దున్నుకున్నట్లయితో భూమి గుల్లబారి పొరలు ఏర్పడకుండా మెత్తగా తయారై నీటిని నిల్వ చేసుకొనే శక్తి పెరుగుతుంది. అంతే తేమతో జీవించే మేలు సూక్ష్మాతి సూక్ష్మి జీవులు గణనీయంగా వృద్ధి చెందడంతోపాటు వాన పాముల సంతతి కూడా భారీగా పెరుగుతుంది. దీంతో భూసార అభివృద్ధి అధికమవుతుంది.
పొలాన్ని సాగుకు సిద్ధం చేస్తున్న రైతు
రబీ తర్వాత లోతైన దుక్కులు చేయాలి
సేంద్రియ ఎరువులతో నేల సారవంతం
జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
అక్కంపల్లి, అగ్గనూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సేంద్రియ సాగుతో..
సేంద్రియ ఎరువులతో దుక్కులు దున్నుకోవాలి. వేసవి దుక్కులు దున్నుకునే ముందు భూమిలో పశువుల ఎరువు, కంపోస్టు లేదా చెరువు మట్టిని చల్లడం వలన నేల సారవంతంగా మారుతుంది. దుక్కులు దున్నే ముందు పొలంలో పశువుల మందలు, గొర్రెలు, మెకల మందలను వదలాలి. ఇలా చేయడం వల్ల అవి విసర్జించే మల మూత్రాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం విపరితంగా పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల ప్రత్యేకించి పశువుల ఎరువును ఖరీదు చేసే పరిస్థితి కూడ తగ్గుతుంది. సేంద్రియ ఎరువులను అందించడం ద్వారా పండించే పంట పొలాల్లో సూక్ష్మ – స్థూల పోషక పదార్థాల లోపాలను నివారించుకోవచ్చు.


