స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
మోమిన్‌పేట: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని చిన్న కోల్కుంద గ్రామంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విశాల, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సంగమేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దీపక్ తివారి
దుద్యాల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. బుధవారం దుద్యాల్ మండలం హస్నాబాద్‌లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, తహసీల్దార్ కిషన్, జీపీఓ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి
దుద్యాల్: నిరుపేదలకు ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని జిలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని హంసంపల్లిలో ఇందిరమ్మ ఇంటిని పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. గత పాలకులు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పమ్మ, పంచాయతీ కార్యదర్శి పుష్పలత, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సీతారాం, సర్పంచులు హన్మా నాయక్, మొగులయ్య, నాయకులు గోపాల్, మల్లికార్జున్, జెల్లరాజు, రాములు, శివ చౌహాన్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 11న నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో యువజన విభాగం, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు హాజరయ్యే యువతి, యువకులు వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కబిషనర్ విక్రం సింహారెడ్డి, జిల్లా క్రీడల శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు.


