కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటనలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. సభా వేధిక, ప్రాంగణం, పార్కింగ్, ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు జగన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఆర్‌ఐఈ రాములు, డీపీఆర్‌ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.


