చేవెళ్ల: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పేదరికం, నిరుద్యోగం పెరిగిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ధరల నియంత్రించాలనే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందన్నారు. వికసిత్‌భారత్ లక్ష్యం ధరల పెంచడమేనా అని ఎద్దేవా చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తిరెడ్డి, ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, మక్బూల్, మంజుల, పాపయ్య, కార్మికులు మల్లయ్య, వెంకయ్య, యాదమ్మ, నర్సింలు, వెంకటమ్మ, రాజు, శేఖర్, శివ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి


