● యువకుడికి తీవ్ర గాయాలు
● తలకొండపల్లి వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఘటన
ఆమనగల్లు: తలకొండపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తలకొండపల్లి ఎస్‌హెచ్‌ఓ జానకిరాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగరావ్‌పల్లికి చెందిన కుమార్ తన అత్త జంగమ్మ(50)ను తీసుకుని బైక్‌పై తలకొండపల్లికి వెళ్తుండగా కాటన్‌మిల్లు వద్ద ఎదురుగా వచ్చిన లారీ అంతివేగంతో ఢీకొట్టింది. ఘటనలో జంగమ్మ మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన కుమార్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ జానకిరాంరెడ్డి తెలిపారు.


