బషీరాబాద్: మండల పరిధి ఎక్మాయి వాగు నుంచి మంగళవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కంసాన్‌పల్లి(బి) గ్రామానికి చెందిన వెంకటయ్య, గొల్ల బసప్పకు చెందిన (టీఎస్34 కే 3452, ఏపీ39 ఎల్‌ఎఫ్7192) నంబర్ గల రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా పోలీసులు లోక్యానాయక్, నర్సింహులు స్వాధీనం చేసుకున్నారు. పీఎస్‌కు తరలించి, ఇరువురిపై కేసులు నమోదు చేశారు.
జొన్న పంట దగ్ధం
ధారూరు: ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధమైంది. ధారూరు మండలం బాచారం గ్రామానికి చెందిన రైతు కావలి బాలమణి.. తనకున్న రెండు ఎకరాల్లో జొన్న సాగుచేశారు. ఇందుకోసం పెట్టుబడిగా రూ.35 వేలు వెచ్చించారు. పంట కోతకు రాగా.. మంగళవారం సాయంత్రం వరకు ఆరడానికి వదిలిపెట్టారు. అదే రోజు మంటలు చెలరేగి పంట కాలి బూడిదయింది. పంటను విక్రయిస్తే రూ.70 వేల వరకు వచ్చేవని, ఇప్పుడు పెట్టుబడి సైతం కోల్పోవాల్సి వచ్చిందని బాధిత రైతు వాపోయింది. వ్యవసాయ అధికారులు పరిశీలించి, తగిన పరిహారం అందించాలని కోరారు.
యాచారం: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వివరాలు.. మండల పరిధిలోని మాల్–కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలోని గుట్టల ప్రాంతం నుంచి బుధవారం ఓ జింక కిషన్‌పల్లి సమీపంలోకి వచ్చింది. ఇది గమనించిన వీధి కుక్కలు జింకను వెంటాడి దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి కళేబారాన్ని అటవీ ప్రాంతంలో ఖననం చేశారు.
జ్ఞానం ముందు తరాలకు అందించాలి
● ప్రొఫెసర్ ఖాసీం
● అప్పాయిపల్లిలో
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
బొంరాస్‌పేట: చదువు అనే జ్ఞానాన్ని ముందు తరాలకు అందించాలని, అలాగే సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పంచాలని ప్రొ. ఖాసీం అన్నారు. బుధవారం కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ చూపిన బాటలో నడవాలన్నారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. రెండు వందల ఏళ్ల క్రితమే సీ్త్ర విద్యను జ్యోతిరావు పూలే స్థాపించారని గుర్తు చేశారు. రేలారే రేలా ప్రసాద్ కళాబృందం నిర్వహించిన ధూమ్‌ధామ్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు గోకుల్‌సింగ్, సర్పంచ్ వెంకటయ్య, నిర్వాహకులు శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శివకుమార్, రమేశ్‌బాబు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


