అనంతగిరి: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఎగ్జామినేషన్– 2027 కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని మైనార్టీ జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకుచెంది, ఆసక్తి ఉన్న మైనార్టీ విద్యార్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ద, పార్సి) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, స్క్రీనింగ్ పరీక్ష జూన్ 14న ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040– 2323 6112లో సంప్రదించాలని సూచించారు.
విద్యుదాఘాతంతో
ఇల్లు దగ్ధం
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధి శివరాంనగర్‌లో విద్యుదాఘాతంతో ఓ ఇల్లు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. శివారంనగర్‌కు చెందిన నరసింహచారి కుటుంబ సమేతంగా తన ఇంట్లోని రెండో అంతస్థులో నివా సం ఉంటున్నారు. బుధవారం వారందరూ బయటకు వెళ్లగా.. చారి తండ్రి ఒక్కడే ఉన్నా డు. మధ్యాహ్నం ఇంట్లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్మేసింది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకువ చ్చారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఫర్నిచర్ తదితర సామగ్రి కాలిపోయింది. రూ.10 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. సీఐ రఘుకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.
కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్ల పరిశీలన
తాండూరు: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్లను సంబంధిత అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ నెల 4వ తేదీ వరకు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు మొత్తం 19 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో మైనార్టీ విభాగం నుంచి పురుషులు నలుగురు, మహిళలు ఇద్దరు ఉన్నారు. అనుభవజ్ఞుల విభాగం నుంచి 13 నామపత్రాలు వచ్చాయి. ఇందులో పురుషులు 8, మహిళలు 5గురు ఉన్నారు. పత్రాల పరిశీలనలో 7 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. 12 మంది ఎన్నికకు అర్హత సాధించారు. ఈ నెల 11న ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ పదవులకు ఇద్దరు రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం పీఏసీఎస్ సీఈఓ గణేశ్‌కు రాజీనామా లేఖలను అందజేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికై న టేకుల సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్‌గా గెలుపొందిన క్యామా శంకర్ పీఏసీఎస్ డైరెక్టర్లుగా ఉన్నారు. జోడి పదవులు ఉండకూడదని రాజీనామా చేసినట్లు తెలిపారు .


