ఇబ్రహీంపట్నం రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు బోసుపల్లి ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ మండల అధ్యక్షుడు గోదల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో దండుమైలారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లు ధాన్యం అన్‌లోడ్ చేయకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. దండుమైలారం ఐకేపీ సెంటర్‌లో సీజన్‌కి 80 వేల నుంచి లక్షా బస్తాలు కొనుగోలు చేస్తుండగా సూమారుగా 640 క్వింటాళ్ల ధాన్యం అదనంగా రైతుల నుంచి ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మకై ్క రైతులకు రూ.25 లక్షల వరకు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చొరవ తీసుకొని సౌకర్యాలు కల్పించాలని కోరారు. లేదంటే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొండ రమణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నెర్రపల్లి సర్పంచ్ శ్రీహరి, వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప్


