షాద్‌నగర్: తెలంగాణ వికాసమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కుటుంబ పార్టీలను ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఆరంభం మాత్రమేనని అన్నారు. వికసిత తెలంగాణ లక్ష్యంగా ద్యేయంగా కేంద్రం పని చేస్తోందన్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి రాజభూపాల్, నాయకులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కక్కునూరి వెంకటేష్‌గుప్తా, దేపల్లి అశోక్, చెంది మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి


