తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు

జిల్లా సెన్సెస్‌ అదనపు అధికారి రవీందర్‌రావు

తాండూరు: తప్పులకు ఆస్కారం లేకుండా జనగణన నిర్వహించాలని జిల్లా సెన్సెస్‌ అదనపు అధికారి రవీందర్‌రావు సూచించారు. మంగళవారం తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్యుమరేటర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన పక్కాగా నిర్వహించాలన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారి జంగయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ, కమిషనర్‌ మధుసూదర్‌రెడ్డి, మేనేజర్‌ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement