దుద్యాల్: ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన లాభాలు పొందవచ్చని కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ అన్నారు. మంగళవారం మండలంలోని హస్నాబాద్ రైతు వేదికలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. కొడంగల్‌లో నియోజకవర్గంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యాన శాఖ అధికారి సురేందర్ నాథ్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వం సబ్సిడీ అందించి ప్రోత్సహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే సాగుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, దుద్యాల్, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల వ్యవసాయ అధికారులు నాగరాజు, శ్రీలత, లావణ్య, హార్టీకల్చర్ విస్తరణ అధికారి బాబ్యానాయక్, ఇకో పామ్ ఫీల్డ్ సిబ్బంది మల్లికార్జున్, మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.
ఏడీఏ శంకర్ రాఽథోడ్


