చిన్నారులు ఉన్నతస్థాయికి ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

చిన్నారులు ఉన్నతస్థాయికి ఎదగాలి

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

హుడాకాంప్లెక్స్‌: చిన్నారులు క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత ఆకాంక్షించారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. శిక్షణ పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, వారి ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కోచ్‌లకు పలు సలహాలు, సూచనలు చేశారు. శిక్షణలో మరింత నాణ్యత పెంచాలని సూచించారు. జిల్లా యువజన క్రీడల అధికారి స్వర్ణలత మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కోచింగ్‌ క్యాంపులో నమోదు చేయించి వారి క్రీడా భవిష్యత్‌కు పునాదులు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ శిబిరంలో బ్యాడ్మింటన్‌, జిమ్నాస్టిక్స్‌, క్రికెట్‌, స్విమ్మింగ్‌, స్కేటింగ్‌, బాస్కెట్‌బాల్‌, లాన్‌ టెన్నిస్‌, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, బాక్సింగ్‌, కబడ్డీ, కరాటే, టేబుల్‌ టెన్నిస్‌ తదితర విభాగాల్లో శిక్షణ ఇసున్నట్టు తెలిపారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement