ఇబ్రహీంపట్నం రూరల్: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మను చౌదరి మాట్లాడుతూ.. ఈ నెల 10న మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో కూడా పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అధికారులు తమకు నిర్దేశించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ఎక్కడా ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, పోలిస్ శాఖ, విద్యుత్, ట్రాన్స్‌పోర్టు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మను చౌదరి


