పరిగి సీఐగా కొండల్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

పరిగి సీఐగా కొండల్‌రెడ్డి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

పరిగి సీఐగా కొండల్‌రెడ్డి దరఖాస్తుల ఆహ్వానం పీఏసీఎస్‌ చైర్మన్ల పదవీ కాలం పొడిగింపు భూసార పరీక్షలు తప్పనిసరి ఎల్లమ్మ జాతరకు రండి కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దాం

పరిగి: పరిగి సీఐగా కొండల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి మల్టీజోన్‌ –2 ప్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ కార్యాలయానికి బదిలీ అయినట్టు అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా సాలిగౌరారం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కొండల్‌రెడ్డిని పరిగి సీఐగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

పరిగి: మండలంలోని జాఫర్‌పల్లి మోడల్‌ స్కూల్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ కుక్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ అంజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 7వ తేదీ లోపు మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేయాలన్నారు.

కోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక కమిషనర్‌

వికారాబాద్‌: పీఏసీఎస్‌ చైర్మన్ల పదవీ కాలం పొడిగిస్తూ ప్రత్యేక కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఫిబ్రవరి 15తో పీఏసీఎస్‌ పాలక మండళ్ల పదవీ కాలం పూర్తయ్యింది. ఆరు నెలల పాటు పొడిగించిన ప్రభుత్వం ఆ తర్వాత సహకార సంఘాలను రద్దు చేసింది. జిల్లాలో మొత్తం 19 సహకార సంఘాలు ఉండగా ఇందులో మెజార్టీ చైర్మన్లు బీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. దీంతో వారిని కొనసాగించటం ఇష్టం లేని ప్రభుత్వం వారి పదవీ కాలం పూర్తవగానే అధికారులను పర్సన్‌ ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల నియామకం చట్ట విరుద్దమంటూ గత పాలక మండళ్లు కోర్టును ఆశ్రయించాయి. ఎన్నికలు నిర్వహించే వరకు గత పాలక మండళ్లనే కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు గత ఫిబ్రవరి 14వ, తేదీ వరకు ఉన్న కమిటీలను కొనసాగించాలని తాజాగా వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పూడూరు: రైతులు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా ఎరువులు వాడాలని భారతీయ నూనె గింజల ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్‌ జవహర్‌లాల్‌ సూచించారు. సోమవారం మండలంలోని మంచన్‌పల్లి రైతు వేదికలో సమతూల్య ఎరువుల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాఘవేందర్‌, శాస్త్రవేత్తలు ఉషాకిరణ, రమ్య, చంద్రిక, ఏఓ ప్రభాకర్‌, ఏఈఓ మహిపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

తాండూరు రూరల్‌: మండలంలోని కొత్లాపూర్‌ రేణుక ఎల్లమ్మ జాతరకు రావాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల ప్రవీణ్‌రెడ్డి, ఈఓ శేఖర్‌గౌడ్‌ కోరారు. సోమవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 15న జరిగే రథోత్సవం, సిడె కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు.

మీర్‌పేట: మేడే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జంగయ్య పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లెలగూడ వార్డు కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లతో పనిగంటల భారం పడడంతో పాటు స్వేచ్ఛ లేకుండా చేసిందని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement