కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

అనంతగిరి: కాంగ్రెస్‌తోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అనంతగిరిపల్లి వార్డులో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కళను కాంగ్రెస్‌ నిజం చేస్తోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని వాగ్దానాలను నెరవేరుస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీకి అత్యధిక నిధులు తీసుకువచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి, నాయకులు రెడ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో జొన్న కొనుగోలు కేంద్రం

ధారూరు: మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం గట్టెపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దోర్నాల్‌, గురుదోట్ల గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌, డీసీసీ కార్యదర్శి మహ్మద్‌ బాబాఖాన్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, ధారూరు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్‌ల సీఈఓలు నర్సింహులు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement