బాధ్యతగా పని చేద్దాం | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా పని చేద్దాం

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

అనంతగిరి: ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిషారంలో అధికారులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్డీఓ శ్రీనివాస్‌, డీపీఓ జయసుధ, డీటీడీఓ కమలాకర్‌ రెడ్డి, డీఎస్సీడీఓ జైపాల్‌ రెడ్డి, డీబీసీడీఓ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం సేకరణకు సమాయత్తం కండి

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరం నుంచి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని 129 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరం మేరకు గోనె సంచులను సరఫరా చేయాలని సంబంధిత అధికారికి ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ మురళీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్‌, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, డీసీఓ నాగార్జున, డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ వెంకట్‌ రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement