చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

పరిగి: వర్షాకాలానికి ముందే చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని తన నివాసంలో ఆయా మండలాల నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, కుంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ రవికుమార్‌, ఈఈ రేణుక, డీఈఈలు పార్థసారథి, కృష్ణారెడ్డి, ఏఈలు పాల్గొన్నారు.

అభివృద్ధి చూసే చేరికలు

పూడూరు: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే ఇతర పార్టీలకు చెందిన పలువురు హస్తం పార్టీలో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చన్గోముల్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, జెడ్పీ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు అజిమొద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అజిమొద్దీన్‌ మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌ ముదిరాజ్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ రామస్వామి, నాయకులు శ్రీనివాస్‌ గుప్తా, తిర్మల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement