నవాబుపేట: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం ఎక్ మామిడి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవాబ్‌పేట్ పసుల రాజు తన రెండు ఎడ్లతో పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. ఊరు చివరన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఓ ఎద్దు తగలి.. విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. ఎద్దు విలువ రూ.లక్ష వరకు ఉంటుందని, ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వలనే నష్టపోయాయని రైతు పేర్కొన్నాడు. ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఉంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదని వాపోయారు. అధికారులు స్పందించి, తగిన న్యాయం చేయాలని కోరాడు.
కడ్తాల్: న్యామతాపూర్‌లోని ఓ వ్యవసాయ పొలం వద్ద గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడు నల్లవోతుల లక్ష్మయ్య (30) గ్రామంలోని మద్దూరు రామిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 2న శనివారం ఉదయం పనికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఊరి శివారులోని ఓ బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు లక్ష్మయ్యగా గుర్తించడంతో బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదిరెడ్డి తెలిపారు. 40 అడుగుల లోతున్న బావిలో నుంచి శవాన్ని తీసేందుకు పోలీసులకు సహకరించిన స్థానికులు తానేషా, రాములును పీఎస్‌కు పిలిపించి సన్మానించడంతో పాటు నగదు అందించారు. ఎస్‌ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్ ఉన్నారు.
హత్య కేసులో
నిందితుల రిమాండ్
కొందుర్గు: హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ విజయ్ కథనం ప్రకారం.. జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామానికి చెందిన కడమూరి పోచమ్మ (70)ని ఆస్తికోసం కన్న కొడుకు భీమయ్య, కోడలు పద్మమ్మ కలిసి హ్యతచేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను ఆదివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
శంకర్‌పల్లి: పట్టణానికి చెందిన ఓ టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సేన) నాయకుడు సోమవారం నిర్వహించిన తన కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.


