చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో డ్రైవర్‌కు రిమాండ్‌ యువతి అదృశ్యం

పూడూరు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్లను పొడిగించడంతో పూడూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ పట్లోళ్ల సతీష్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. మరోమారు రైతులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు.

మీర్‌పేట: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కారు డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 1వ తేదీన రాత్రి గాయత్రీ నగర్‌ వద్ద మీర్‌పేటకు చెందిన తండ్రీకొడులు జిలానీ, ఫైజల్‌ బైక్‌ వెళ్తున్నారు. సింగరేణి కాలనీకి చెందిన కారు డ్రైవర్‌ నీలకంఠం సత్యనారాయణ బైక్‌కు సైడ్‌ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకంఉది. ఈ క్రమంలో సత్యనారాయణ కారులో కూర్చుని ఫైజల్‌ను తోసేయడంతో డివైడర్‌పై పడి గాయపడ్డాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు యత్నించగా జిలానీ బైక్‌ను కారుకు అడ్డుగా పెట్టాడు. ఆయన్ను ఢీకొట్టడంతో బానైట్‌పై పడ్డాడు. కారు ఆపకుండా రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను రిమాండ్‌కు తరలించారు.

మొయినాబాద్‌: బంధువుల రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో పడుకున్న యువతి తెల్లవారే సరికి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అజీజ్‌నగర్‌కు చెందిన డప్పు చంద్రయ్య కుటుంబం ఆదివారం రాత్రి బంధువుల రిసెప్షన్‌కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు చంద్రయ్య నిద్ర లేచి చూడగా కూతురు చందన(19) కనిపించలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement