కనీస సౌకర్యాలు కరువు
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఆదివారం వికారాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ఉండగా.. విద్యార్థులు ఉదయం 11గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమంతించారు. నాలుగు సెంటర్‌లలో 1,179 మంది విద్యార్థులకు గాను 1,148 మంది విద్యార్థులు హాజరవ్వగా 31మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సందర్శించారు. – అనంతగిరి
ఇంధన కొరత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఇంధన దిగుమతులకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనతో పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూకడుతున్నారు. నిల్వలు తక్కువగా ఉండడంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు.
● నేటికీ దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు
● ఆంక్షలు విధిస్తున్న బంకుల యాజమాన్యాలు
● పట్టించుకోని పౌరసరఫరాల శాఖ
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వినియోగదారుల ఇబ్బందులు


