‘మహిళా రిజర్వేషన్‌’ వెనుక కేంద్రం కుట్ర | - | Sakshi
Sakshi News home page

‘మహిళా రిజర్వేషన్‌’ వెనుక కేంద్రం కుట్ర

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

బన్సీలాల్‌పేట్‌: మహిళా రిజర్వేషన్ల అంశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని సికింద్రాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు దీపక్‌ జాన్‌ ఆరోపించారు. పద్మారావునగర్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును డీలిమిటేషన్‌(నియోజకవర్గాల పునర్వీభజన) ప్రక్రియతో ముడిపెట్టడాన్ని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వివరించారు. 543 పార్లమెంట్‌ స్ధానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలా చేస్తే తమ కూటమి పూర్తి స్ధాయిలో మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ స్ధా నాల సంఖ్యను పెంచిన తర్వాతే రిజర్వేషన్లు అ మలు చేస్తామనడం మహిళలను మోసం చేయడమేనన్నారు. సికింద్రాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు వీఎస్‌ నారాయణ, శ్రీనివాస్‌లతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement