ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు

Feb 24 2026 9:13 AM | Updated on Feb 24 2026 9:13 AM

ఫెర్ట

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు

దుద్యాల్‌: యూరియా కావాంటే.. కండీషన్‌ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. డీఏఓ రాజరత్నం ఫెర్టిలైజర్‌ షాపుల్లో తనిఖీలు చేయాలని కొడంగల్‌ ఏడీఏ శంకర్‌ రాథోడ్‌ను ఆదేశించారు. దీంతో ఆయన దుద్యాల్‌, బొంరాస్‌పేట్‌, కొడంగల్‌లోని పలు దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా కోసం వచ్చిన రైతులకు బయో ఉత్పత్తులను బలవంతంగా అంటగడితే సహించేదిలేదని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలిగించినట్లు తెలిస్తే షాపు లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. అన్నదాతలు అడిగిన మందులు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు.

బీఆర్‌ఎస్‌కు యువతే బలం

మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి

తాండూరు టౌన్‌: బీఆర్‌ఎస్‌ బలోపేతంలో యువత పాత్ర కీలకమని మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరులో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు మజార్‌తో పాటు పలువురు విద్యార్థులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమాలకు విద్యార్థుల తోడు ఎనలేని శక్తినిస్తుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన విద్యార్థులు విద్యారంగంలో నెలకొని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పట్లోళ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి

బొంరాస్‌పేట: తండాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మేడిచెట్టు తండా పంచాయతీ పరిధిలోని బోడబండ తండాలో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు వెంకట్రాములు గౌడ్‌, అంజిల్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్‌, సర్పంచ్‌ రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

పరిగి: పరిగి ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి మంగళవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే సెల్‌ నంబర్‌ 9959225253కు కాల్‌ చేసి తెలియజేయాలని సూచించారు.

నేటి నుంచి జీపీ వార్డు

సభ్యులకు శిక్షణ

తాండూరు రూరల్‌: మండలంలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆయా జీపీలకు చెందిన 280 మంది వార్డు సభ్యులు శిక్షణ కార్యక్రమానికి విధిగా హాజరుకావాలని ఆయన కోరారు.

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు 
1
1/3

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు 
2
2/3

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు 
3
3/3

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement