గూడుకట్టిన జాప్యం
బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాకు 5,740 గృహాలు మంజూరు ఆ తర్వాత 3,800 కుదింపు అప్పట్లో వచ్చిన దరఖాస్తులు 12,205 వివిధ దశల్లో 2,257 నిర్మాణాలు కేటాయించేందుకుసిద్ధంగా ఉన్నవి 1,031
వికారాబాద్: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంది. పూర్తయిన వాటి ని కూడా అర్హులకు కేటాయించలేదు. ఏడాది క్రితం పేదలకు కేటాయిస్తామని హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. రెండు రో జుల క్రితం కలెక్టర్ ప్రతీక్‌జైన్.. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి పట్టణ శివారులోని డబుల్ ఇళ్లను పరిశీలించారు. పెండింగ్ పనులను పూర్తి చే సి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఏడాది క్రితం కూడా ఓ సారి సందర్శించారు. కానీ లబ్ధిదారులకు కేటాయించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన వారికే కేటాయిస్తారా..? కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారా అనేది తేలాల్సి ఉంది. కొన్ని మండలాల్లో ఐదేళ్ల క్రితం, మరి కొన్ని చోట్ల మూడేళ్ల క్రితం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దరఖాస్తుల పరిశీలన పూర్తి
గత ప్రభుత్వ హయాంలో డబుల్ ఇళ్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో అర్హులను గుర్తించేందుకు ఆయా శాఖల నుంచి ముగ్గురు అధికారుల చొప్పున టీమ్‌లను ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. వచ్చిన అర్జీల్లో 50శాతం మాత్రమే అర్హులు ఉన్నట్టు తేలింది. రెండు సార్లు స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరంతా ఇళ్లు వస్తాయని ఏళ్ల తరబడి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు నేటికీ నెరవేరలేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి ఇళ్లు తుది దశకు చేరాయి. చిన్నచిన్న మరమ్మతులు చేస్తే అర్హులకు కేటాయించవచ్చు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
గతంలో జిల్లాకు 5,740 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లో ఆయా మండలాల నుంచి 12,205 మంది అర్జీలు పెట్టుకున్నారు. 2016లో నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఆ తర్వాత ఇళ్ల సంఖ్యను 3,800 కుదించారు. ప్రస్తుతం 2,257 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 1,031 చిన్న చిన్న పనులు మినహా పూర్తి కావచ్చాయి. ధారూరులో 120 ఇళ్లు, మర్పల్లిలో 120, యాలాల్ మండలం కోకట్‌లో 180, తాండూరు పట్టణంలో 401, పరిగిలో 180, చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో 30 పూర్తయ్యాయి. వీటిని తమకు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
డబుల్ బెడ్‌రూంల కేటాయింపులో అలసత్వం


