రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
అనంతగిరి: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ విద్య జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 25 నుంచి మొదటి సంవత్సరం, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఇయార్‌లో జనరల్ విద్యార్థులు 6,708 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,686 మంది, సెకండ్ ఇయార్‌లో జనరల్ విద్యార్థులు 6,549 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,457 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కేంద్రంలో తాగునీటి సౌకర్యం, వసతులు కల్పించామన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. విద్యార్థులు ఉదయం 8గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇందుకు ఆర్‌టీసీ బస్సులు నడుపుతోందని పేర్కొన్నారు. ఉదయం 9.05గంటలకు కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు


