ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం
ఆమనగల్లు: మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో కొప్పు లక్ష్మయ్యకు చెందిన గడ్డివాము శనివారం ఉదయం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఆయన తన వ్యవసాయ పొలం వద్ద పశుగ్రాసం కోసం గడ్డిని నిల్వ ఉంచాడు. ఉదయం పశువుల వద్ద పాలు తీసుకుని ఇంటికి వెళ్లి వచ్చేసరికే గడ్డివాము కాలిపోయింది. సంఘటనా స్థలాన్ని సర్పంచ్ కొప్పు యాదయ్య పరిశీలించి బాధిత రైతును ఓదార్చారు. రూ.30 వేల విలువచేసే గడ్డి దగ్ధమైందని ప్రభుత్వపరంగా బాధిత రైతును ఆదుకోవాలని సర్పంచ్ కోరారు.
నిజాయతీ చాటుకున్న విద్యార్థి
దొరికిన బంగారు ఉంగరాన్ని ఉపాధ్యాయులకు అప్పగింత
యాచారం: ఓ విద్యార్థి తన నిజాయతీని చాటుకున్నాడు. తనకు పాఠశాల ఆవరణలో దొరికిన బంగారు ఉంగారాన్ని ఉపాధ్యాయులకు అందజేసి శభాష్ అనిపించుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కుర్మిద్ద ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం వార్డు సభ్యురాలు సంతోషినిప్రియ సందర్శించే సమయంలో రూ.మూడు లక్షల విలువ జేసే బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఆ ఉంగరం అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దండె విక్రమ్‌కు దొరికింది. అతడు ఉంగరాన్ని పాఠశాల హెచ్‌ఎం పాండురంగారెడ్డికి అందజేశారు. ఉంగరాన్ని పోగొట్టుకున్న వివరాలు ఆరా తీయగా వార్డు సభ్యురాలు సంతోషినిప్రియగా తేలింది. హెచ్‌ఎం పాండురంగారెడ్డి సంతోషినిప్రియకు సమాచారం ఇచ్చి ఉంగరాన్ని అందజేశారు. నిజాయతీగా ఉంగరాన్ని అందజేసిన విక్రమ్‌ను ఉపాధ్యాయులు, వార్డు సభ్యురాలు అభినందించి, సన్మానించారు.
స్కూటీని ఢీకొట్టిన లారీ
వ్యక్తి దుర్మరణం
కొందుర్గు: స్కూటీని లారీ ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్‌పహాడ్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలుకు చెందిన చాంద్ పాషా(40) లాల్‌పహాడ్ వద్ద పాన్‌షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించేవారు. అతడికి భార్య అమీరా బేగంతోపాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే శనివారం సాయంత్రం తన స్వగ్రామం రాపోలు నుంచి లాల్‌పహాడ్ స్కూటీపై వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో స్కూటీ నడుతున్న చాంద్‌పాషాపై నుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయి అక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి భార్య అమీరా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ విజయ్ తెలిపారు.
మళ్లీ విధుల్లోకి అదనపు
కలెక్టర్ ప్రతిమాసింగ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రతి మా సింగ్ మళ్లీ విధు ల్లో చేరారు. ఆమె కొంతకాలంగా ప్రసూతి సెలవుల్లో వెళ్లారు. మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు శ్రీనివాస్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించారు. ప్రతిమా సింగ్ రాకతో ఆయన తన పూర్వస్థానంలోకి వెళ్లిపోయారు.
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం


