ఓటరు జాబితాలో తప్పులను సవరించండి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాలో తప్పులను సవరించండి

Feb 22 2026 8:41 AM | Updated on Feb 22 2026 8:41 AM

ఓటరు జాబితాలో తప్పులను సవరించండి

ఓటరు జాబితాలో తప్పులను సవరించండి

దోమ: ఆయా గ్రామాల్లోని ఓటరు జాబితాలో తప్పులను సవరించేందుకు అవకాశం ఉందని తహసీల్దార్‌ గోవిందమ్మ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఆయా పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఓటర్‌ లిస్ట్‌ను పరిశీలించాలన్నారు. తప్పులు ఉంటే చేసుకోవచ్చని, చనిపోయిన ఓట్లర్ల పేర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ పర్వేజ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వినోద్‌, ఆర్‌ఐలు రాంచంద్రారావు, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ గోవిందమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement