మంత్రి పొన్నంను కలిసిన ఉద్యమకారులు
అబ్దుల్లాపూర్‌మెట్: తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు శనివారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌తో పాటు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యమకారుల అంశం రాజ్యసభలో ఆమోదం తెలిపిన సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రితో పాటు ఎమ్మెల్సీలను కలిసి వారికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం నాయకులు ఓరుగంటి ఆనంద్, జెనిగె విష్ణువర్ధన్, కారింగుల నరేందర్‌గౌడ్, కొంతం యాదిరెడ్డి, నక్క జంగయ్యగౌడ్, జోర్క రాముముదిరాజ్, జానకిరెడ్డి, మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


