ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
బొంరాస్‌పేట: పండిత పరిషత్ కృషితోనే భాషా పండితుల అప్‌గ్రెడేషన్ సాధ్యమైందని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (రూప్ టీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ అన్నారు. మండల కేంద్రంలో ఆ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ మేరకు పండిత పరిషత్ అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగోన్నతల సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్, సీహెచ్‌ఎం రవీందర్‌గౌడ్, ఆ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింలు, మహిళాధ్యక్షురాలు రిజ్వానా బేగం, నాయకులు కృష్ణ, బాల్‌రాజ్, వందన, అంజు, మధుబాయి తదితరులు పాల్గొన్నారు.


