పుర నగారా
న్యూస్‌రీల్
వికారాబాద్‌లో 12 కౌంటర్ల ఏర్పాటు
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026
వికారాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలింగ్ బూత్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12న పోలింగ్, 13న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం నాలుగు పురపాలికలు.. 100 వార్డులు ఉన్నాయి. వికారాబాద్ పుర పీఠం ఎస్సీ మహిళకు, తాండూరు బీసీ జనరల్‌కు, పరిగి బీసీ మహిళకు, కొడంగల్ జనరల్‌కు కేటాయించారు.
అమలులోకి ఎన్నికల కోడ్
మున్సిపల్ ఎన్నికల కోడ్ మంగళవారం సాయంత్రం నుంచి అమలులోకి వచ్చింది. ఓటర్లను ప్రలోభపెట్టే కొత్త పథకాలు, కార్యక్రమాలు నిర్వహించరాదు. నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మరో నెలరోజుల పాటు బ్రేక్ పడనుంది. కొత్త లబ్ధిదారుల ఎంపిక ఉండదు. పాత పథకాలు యథావిధిగా కొనసాగనున్నాయి. గోడలపై రాతలు, పార్టీ సంబంధ పోస్టర్లను తొలగిస్తున్నారు. దేశ నాయకులు మినహా ఆయా పార్టీల నేతల విగ్రహాలకు ముసుగులు తొడగనున్నారు.
రేసులో..
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల్లో రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లు ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వికారాబాద్‌లో కాంగ్రెస్ తరఫున స్పీకర్ కూతురు లేదా మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె బరిలో ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ తరఫున బలమైన అభ్యర్థి పోటీలో ఉండే అవకాశం ఉండటంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం అదేస్థాయి నాయకులను పోటీలో ఉంచాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాండూరులో కాంగ్రెస్ తరఫున రవిగౌడ్, బీఆర్‌ఎస్ తరఫున మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ భర్త నర్సింహులు పోటీలో ఉండే అవకాశం ఉంది. పరిగిలో బీఆర్‌ఎస్ తరఫున శివన్నొళ్ల భాస్కర్ భార్యను చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. కొడంగల్ జనరల్ కావడంతో ఇరు పార్టీలు బలమైన నేతల కోసం అన్వేషణ మొదలు పెట్టారు.
మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఒకే విడతలో పోలింగ్
అమలులోకి వచ్చిన కోడ్
ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
జిల్లాలో నాలుగు పురపాలికలు
వంద వార్డులు
మున్సిపాలిటీల వారీగా వార్డులు, ఓటర్లు
మున్సిపల్ వార్డులు పురుషులు సీ్త్రలు మొత్తం ఓటర్లు జనాభా
వికారాబాద్ 34 28,751 29,339 58,117 63,649
తాండూరు 36 37,547 39,558 77,110 71,008
పరిగి 18 13,822 13,792 27,614 18,241
కొడంగల్ 12 5,661 6,007 11,688 14,294
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్‌లో రెండు నుంచి మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి సెంటర్ వద్ద ఆర్‌ఓ, ఏఆర్‌ఓ అందుబాటులో ఉంటారు. ఉదయం 10.30నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు
మొత్తం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్
వార్డులు జనరల్ మహిళ జనరల్ మహిళ జనరల్ మహిళ జనరల్ మహిళ
వికారాబాద్ 34 1 1 4 3 4 4 9 8
పరిగి 18 1 0 1 1 3 3 5 4
కొడంగల్ 12 1 0 1 1 2 1 4 2
తాండూరు 36 1 0 1 1 8 7 10 8
మొత్తం 100 4 1 7 6 17 15 28 22
మున్సిపాలిటీ
పుర నగారా
పుర నగారా


