విధి నిర్వహణలో అలసత్వం వద్దు
● జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి
● పలు ఆస్పత్రుల సందర్శన
తాండూరు టౌన్: విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించరాదని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి సిబ్బందికి సూచించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రం, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్స్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించాలని, రోగులకు ఓర్పుతో వైద్య సేవలందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎంసీహెచ్‌లో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లను తనిఖీ చేశారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలకు తగిన పోషకాహారం అందించాలన్నారు. అలాగే పిల్లలతో ఉండే తల్లులకు ప్రభుత్వం కేటాయించిన దినసరి వేతనాన్ని అందజేయాలన్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని, విధులను సక్రమంగా నిర్వర్తించని ఎడల శాఖాపరమైన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీనివాసులు, ఆస్టిన్, సత్యం, సువర్ణ పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి పాలీయేటివ్ కేర్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బందికి హెపటైటీస్ బీ వాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో వీ శ్రీనివాసులు, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యం, ఇన్ సీడీ కోఆర్డినేటర్ జయరాములు తదితరులు పాల్గొన్నారు.


