పకడ్బందీగా కోడ్ అమలు
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా కోడ్ అమలు చేస్తామని కలెక్ట్రర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తక్షణమే కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ కేంద్రాల్లోని రాజకీయ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఫొటోలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్ సుధీర్, తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


