ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
పరిగి: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం 2026వ సంవత్సరం క్యాలెండర్‌ను మంగళవారం పరిగి పట్టణంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు. నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.
పరిగి పట్టణాన్ని ఆదర్శంగా నిలుపుతాం
పరిగి పట్టణ ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించి ఆదర్శంగా నిలుపుతామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.20 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


