తాండూరు: పదేళ్లుగా కుంటుపడిన అభివృద్ధిని 15 నెలల్లోనే పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని క్లాసిక్ గార్డెన్‌లో నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా సుస్థిర పరుస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నియోజకవర్గంలో గ్రామా ల్లో కోట్ల నిధులు వెచ్చించి రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి చేశామని వివరించారు. ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నా రు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందజేస్తామని వివరించారు. ఇందిరమ్మ కమిటీల పనితీరుపైనే ఎన్నికల ఫలితా లు ఆధారపడి ఉంటాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పనులు దండిగా కొనసాగే అవ కాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్ మహరాజ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమి టీ చైర్మన్లు బాల్‌రెడ్డి, మాధవరెడ్డి, అంజయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, నాయకులు మురళీకృష్ణాగౌడ్, భీమయ్య, అజయ్‌ప్రసాద్, నర్సింహులుగౌడ్, కావలి సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
ఏడాది కాలంలో నియోజకవర్గంలో రోడ్డు పనులు పూర్తి
ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి


