26 నుంచి లాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

26 నుంచి లాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

● వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థిగా వాసుయాదవ్‌ ● నామినేషన్లు అడ్టుకున్నా వెనక్కి తగ్గని వైనం ● భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ రౌడీ బ్యాచ్‌

తిరుపతి సిటీ: ఏపీ లాసెట్‌, ఏపీ పీజీఎల్‌సెట్‌–2026కు సంబంధించి యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుందని లాసెట్‌ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందలేని విద్యార్థులు తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అలాగే ఏపీ పీఈసెట్‌–2026లో భాగంగా బీపీ ఈడీ, డీపీఈడీ కోర్సులలో ప్రవేశాల కోసం వచ్చే నెల 2వ తేదీన కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టి కన్వీనర్‌ కోటా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

బీసీ వర్గానికే మరో అవకాశం

తిరుపతి అర్బన్‌: వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర మేయర్‌ అభ్యర్థిగా యచ్చెం వాసుయాదవ్‌ను ఎంపిక చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పార్టీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాల్లో చుర్గుగా పాల్గొన్న ఆయనపై ఇప్పటికే 18 అక్రమ కేసులు ఉన్నాయి. వాసుయాదవ్‌ స్టేట్‌ బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌గా, తిరుపతి కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి సూచనల మేరకు పార్టీ అధిష్టనం బీసీ వర్గానికి చెందిన వాసుయాదవ్‌కు అవకాశం కల్పించింది.

వరదయ్యపాళెం ఎంపీడీఓపై వేటు

వరదయ్యపాళెం: మండల ఎంపీడీఓ ఎన్‌.విజయమ్మపై వేటు పడింది. సర్పంచ్‌, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆమెను తక్షణమే విధుల నుంచి తప్పిస్తూ జిల్లా పరిషత్‌ సీఈఓ శోభన్‌బాబు ఉత్తర్వులు జారీచేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఆమెను ఎంపీడీఓ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆమె స్థానంలో ఎంపీడీఓ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏఓ) బి.ప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తున్నట్లు మరో ఉత్తర్వు జారీచేశారు. వెంటనే పూర్తి బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ జోరు.. కూటమి బేజారు

తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తొలి రోజు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి రోజు కొర్లగుంట, బైరాగిపట్టెడ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, మీడియా ప్రతినిధులపై కూటమి గుండాలు దాడులకు తెగబడ్డారు. ఇదిలా ఉంటే వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేసేందుకు ముందుకొచ్చారు. కూటమి నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించించినా వెనుకడుగు వేయకుండా మొత్తంగా 62 నామినేషన్లను దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగగా, కూటమి అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీకి డివిజన్ల పంపకాలు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆయా పార్టీల నేతల్లో అసంతృప్తి నెలకొంది.

తొలి రోజు 88 నామినేషన్లు

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు తొలి రోజు మొత్తం 88 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇందులో వైఎస్సార్‌సీపీ – 62, టీడీపీ– 10, జనసేన– 4, సీపీఐ– ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు –11 నామినేషన్లు దాఖలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా నీరుగట్టు నగేష్‌ లామినేషన్‌ వేశారు.

టీడీపీ అభ్యర్థులు వీరే

సాక్షి, చిత్తూరు: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో పోటీచేయనున్న పలువురు టీడీపీ చైర్‌పర్సన్‌ – మేయర్‌ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. చిత్తూరు మేయర్‌ అభ్యర్థిగా చుడ చైర్‌పర్సన్‌గా ఉన్న కఠారి హేమలత, తిరుపతి కార్పొరేషన్‌ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాసప్రసాద్‌, నగరి అభ్యర్థిగా శ్రీనివాస్‌, కుప్పం అభ్యర్థిగా రాజ్‌కుమార్‌ను ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement