రెడ్‌బుక్‌ పాలనకు స్థానిక ఎన్నికలే నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ పాలనకు స్థానిక ఎన్నికలే నిదర్శనం

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

తిరుపతి మంగళం : చంద్రబాబు, లోకేష్‌ రెడ్‌బుక్‌ పాలనకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులే నిదర్శనమని కర్నూలు, నంద్యాల వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరంలో టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కావన్నారు. తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను చించేసి, వారిపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అరాచకాలు, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ ఇన్‌చార్జ్‌ జేబీ శ్రీనివాస్‌, గూడాలు చేస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. తిరుపతి నగరంతో పాటు పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది గూండాలను పిలిపించుకుని దాడులకు తెగబడుతున్నారన్నారు. జీవితాకాలం టీడీపీ గూండాల పాలనే ఉండదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement