శ్రీకాళహస్తి: సంతానం లేదనే ఆవేదనను ఆసరాగా చేసుకుని ఓ మోసకారి శ్రీకాళహస్తీశ్వరాలయ పూజారినంటూ నమ్మించి డబ్బులు గుంజే ప్రయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం.. నాలుగురోజుల క్రితం మదనపల్లికి చెందిన జ్యోతికి 812175186 నంబర్ నుంచి ఫోనన్ కాల్ వచ్చింది. ఫోనన్ చేసిన వ్యక్తి శ్రీకాళహస్తీశ్వరాలయానికి చెందిన పూజారినంటూ పరిచయం చేసుకున్నాడు. మీకు పిల్లలు లేరు కదా.. సంతానం కావాలంటే ప్రత్యేక పూజలు చేయించాలని సూచించాడు. కాశీ నుంచి కొందరు స్వాములు శ్రీకాళహస్తికి వస్తున్నారని, వారికి అన్నదానం చేస్తే ఆ పుణ్య ఫలంతో సంతానం కలుగుతుందని నమ్మించాడు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించి కొన్ని వస్తువులను పంపిస్తానని చెప్పాడు. భర్త వచ్చిన తర్వాత మాట్లాడిస్తానని జ్యోతి చెప్పడంతో కాల్ ముగిసింది. అనంతరం ఆమె భర్త అదే నంబర్‌కు ఫోన్్ చేయగా, అవతలి వ్యక్తి వాట్సాప్‌లో తన ఫొటో చూశారా అని అడిగాడు. చూశానని చెప్పడంతో పేరు, గోత్రం వివరాలు తెలుసుకుని సంతానం కలిగేలా పూజలు చేస్తానని నమ్మించే ప్రయత్నం చేశాడు.
టోకెన్ల పేరుతో
వేల రూపాయల
వసూలుకు యత్నం
అన్నదానం, ప్రత్యేక పూజల పేరుతో మూడు రకాల టోకెన్లు ఉన్నాయని, మొదటి టోకెన్న్ రూ.11,600, రెండో టోకెన్న్ రూ.16,600, మూడో టోకెన్ రూ.21,600 చెల్లించాలని సూచించాడు. తాము అంత మొత్తం చెల్లించలేమని, రూ.1,000 మాత్రమే ఇవ్వగలమని దంపతులు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి మాట మార్చాడు. కొబ్బరికాయ కొట్టినా, సాంబ్రాణి వేసినా, దండం పెట్టినా కర్మఫలం తొలగదని చెబుతూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. రూ.2,100 చెల్లిస్తే మీ కర్మను తొలగిస్తానంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చాడు. ఫోన్‌న్‌పే ద్వారా డబ్బులు పంపించాలని సూచించాడు.
ఆలయ ఖాతా అంటూ వ్యక్తిగత నంబర్
గుడికి సంబంధించిన ఫోన్‌పే నంబర్ అంటూ 6383958235 నంబర్‌ను చెప్పి, ఆ నంబర్‌కు డబ్బులు పంపించాలని కోరాడు. ఫోనన్్ పేలో నంబర్ నమోదు చేసినప్పుడు వడ్లపూడి మదనమోహన్ అనే పేరు కనిపించిందని బాధితులు తెలిపారు. దీంతో అనుమానం మరింత బలపడింది. డబ్బులు ప్రస్తుతం లేవని, మరుసటి రోజు పంపిస్తామని చెప్పినా సదరు వ్యక్తి వినిపించుకోలేదు.
పూజల పేరుతో కొత్త నాటకం!
ఇంతటితో ఆగకుండా తొమ్మిది రోజుల పాటు ఇంటికి చాకలివాడు రాకూడదని, ఉప్పు, పసుపు, మిరపకాయను ఒక గుడ్డలో కట్టి పూజా మందిరంలో పెట్టాలని సూచించాడు. ఆ మూటను ఏం చేయాలో డబ్బులు చెల్లించిన తర్వాత చెబుతానన్నాడు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన దంపతులు తెలిసినవారిని సంప్రదించడంతో డబ్బులు పంపవద్దని సూచించారు. దీంతో వారు నగదు బదిలీ చేయకుండా అప్రమత్తమయ్యారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు!
శ్రీకాళహస్తీశ్వరాలయం పేరును ఉపయోగించుకుని ఫోన్న్ ద్వారా భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్న ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. తాను ఆలయ ప్రధాన అర్చకుడినని పరిచయం చేసుకుంటూ, గతంలో రాహు–కేతు పూజలు చేయించుకున్నారని, ఈ ఏడాది కూడా పూజలు చేయాలని డబ్బులు పంపించాలంటూ కొందరు ఫోన్న్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భక్తులు అప్రమత్తంగా ఉండాలి
శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు, సేవలకు సంబంధించిన అధికారిక సమాచారం తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్లాలి. ఆలయ సేవలను అధికారిక ఆన్లైన్ విధానం ద్వారా బుక్ చేసుకుని, నిర్ణీత విధానంలోనే పూజలు నిర్వహించుకోవాలి.


