ఎవరు వీళ్లు? | - | Sakshi
Sakshi News home page

ఎవరు వీళ్లు?

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

తిరుపతి అర్బన్‌: నామినేషన్ల తొలిరోజు భయాందోళన కల్పిస్తే.. ఇతర పార్టీలకు చెందిన నేతలు నామినేషన్లు వేయరని భావించిన టీడీపీ నేతలు తిరుపతిలో శుక్రవారం బీభత్సం సృష్టించారు. 31, 32, 33 వార్డులకు సంబంధించి నామినేషన్లు చెన్నారెడ్డి కాలనీలోని 38వ వార్డు సచివాలయంలో ఏర్పాటు చేశారు. అయితే 18 ఏళ్లకు అటు ఇటు వయస్సు ఉన్న వారే 90 శాతం మంది కనిపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయడమే వారి అజెండాగా పనిచేశారు. దీంతో ఎవరు వీళ్లంతా.. ఏంటి ఈ దౌర్జన్యాలు..? అంటూ స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. వీళలో కొందరు తమిళం, మరికొందరు కన్నడ భాషల్లో మట్లాడడంతో వీళ్లంత స్థానికేతరులని గుర్తించారు. పోలీసులంటే భయం లేదు.. జోరు వర్షంలోనూ 38వ వార్డు సచివాలయం ముందు రోడ్డుపై అడ్డంగా నిలబడిపోయారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టీడీపీ మేయర్‌ అభ్యర్థి ఈ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement