అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచాలనే సదుద్దేశంతో ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చేపట్టింది. అయితే అధికార పార్టీ నేతలు.. అధికారుల హడావుడితో లక్ష్యం నీరుగారుతోంది. ప్రధానంగా ఇటీవల సాగుతున్న ఓటర్ల సవరణ గందరగోళంగా మారింది. ప్రజలకు అందించిన ఎన్యూమరేషన్ | - | Sakshi
Sakshi News home page

అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచాలనే సదుద్దేశంతో ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చేపట్టింది. అయితే అధికార పార్టీ నేతలు.. అధికారుల హడావుడితో లక్ష్యం నీరుగారుతోంది. ప్రధానంగా ఇటీవల సాగుతున్న ఓటర్ల సవరణ గందరగోళంగా మారింది. ప్రజలకు అందించిన ఎన్యూమరేషన్

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

● వంద శాతం పూర్తి చేయాలని బీఎల్‌ఓలపై ఒత్తిళ్లు ● మళ్లీ దొంగ ఓట్లు కొనసాగే ప్రమాదం ● చివరి వారంలో చేపట్టిన సవరణ ప్రక్రియపై అనుమానాలు

డిజిటలైజేషన్‌ శాతం పెంచేందుకు అధికారుల హడావుడి

పలు ప్రాంతాల్లో వెనక్కురాని ఎన్యుమరేషన్‌ ఫారాలు

తిరుపతి పోస్టల్‌ కాలనీ

సచివాలయంలో బీఎల్‌ఓలతో మాట్లాడుతున్న కలెక్టర్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) తుది దశకు చేరుకుంది. సర్‌ ప్రక్రియకు గడువు సైతం నేటితో ముగియనుంది. డిజిటలైజేషన్‌కు సమయం చాలదనే విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ.. ఇచ్చిన గడువులో వంద శాతం పూర్తి చేశామనిపించుకునేందుకు హడావుడి చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేసిన 4.65 లక్షల ఎన్యూమరేషన్‌ ఫారాలు వెనక్కు రాలేదని అధికారిక సమాచారం. అదే విధంగా వచ్చిన 7 లక్షలకు పైగా ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌ చేయడంలో ఆలస్యం అవుతోందని అధికారులే చెబుతున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో డిజిటలైజేషన్‌ దాదాపు పూర్తయినట్లు అధికారులు ప్రకటిస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో లక్షల ఫారాల డిజిటలైజేషన్‌ ఎలా పూర్తి చేయగలిగారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు ఉద్దేశానికే ముప్పు

ఓటరు వద్ద సరైన సమాచారం లేకుండా, కేవలం సంఖ్య పెంచే ధోరణిలో ఫారాలు నింపితే జాబితా సవరణ ప్రక్రియే దెబ్బతినే అవకాశం ఉందని పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనుమానం ఉన్న బూత్‌లలో ఈ ప్రక్రియను మరింత జాగ్రత్తగా పూర్తి చేయాల్సిన అవసరముందని సూచిస్తున్నాయి. లేకుంటే ఓటరు సవరణ ఉద్దేశానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి. ముసాయిదా ఓటరు జాబితా వచ్చిన తర్వాత బూత్‌ల వారీగా చివరి వారం రోజుల్లో జరిగిన ఎన్యూమరేషన్‌ను ఓటరు వారీగా వెతికితే తప్ప దొంగ ఓట్లను గుర్తించే అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడే పారదర్శకంగా తనిఖీ చేయకపోతే, తర్వాత జాబితాలోకి చేరిన అనుమానాస్పద ఎంట్రీలు కొత్త సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారులు జాగ్రత్తగా, స్వతంత్ర దర్యాప్తు చేపట్టి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరుతున్నాయి.

ఓటు ఓ చోట.. మరో చోట ఎన్యూమరేషన్‌

తిరుపతి, చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలు వెనక్కు రాకపోవటానికి ముఖ్యమైన కారణముందని బీఎల్‌ఓలు వెల్లడిస్తున్నారు. ఓటు ఒక చోట ఉంటే.. ఎన్యూమరేషన్‌ ఫారాలు మరో చోట అందించారని వివరిస్తున్నారు. ఫారాలు వెనక్కు రాకపోవడంతో ఏదోలా వాటిని పూరించి డిజిటలైజేషన్‌ శాతం పెంచాలని ఉన్నతాధికారులు బీఎల్‌ఓలపై ఒత్తిడి తెస్తున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో అరకొర వివరాలతోనే పత్రాలు నింపి, డిజిటలైజ్‌ చేయాల్సి వస్తోందని బీఎల్‌ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరే చోట ఓటు ఉన్న వారు.. ఇక్కడ ఓటు వద్దని అనుకున్న వారిని కూడా టీడీపీ బీఎల్‌ఏలు ఒప్పించి పారం సేకరించి డిజిటలైజేషన్‌ చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి ఈ తతంగం జోరుగా సాగుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement