గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రైతు కాలర్ ఎగరేసుకుని రాజులా బతికే పరిస్థితి ఉండేది. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా మామిడి టన్ను ధర కనిష్టంగా రూ. 17 పలుకగా, గరిష్టంగా రూ. 28 నుండి రూ. 30 వరకు ధర లభించింది. నాడు ఒక ఏడాది ధర రూ. 18 కి వస్తేనే... పీఎల్‌ఆర్ ఫ్యాక్టరీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మకై ్క ధరలు తగ్గించారంటూ నానా నిందలు వేసిన నాటి ప్రతిపక్ష (ప్రస్తుత కూటమి) నాయకులు, ఈరోజు నోళ్లు, కళ్లు ఎందుకు మూసుకున్నాయి.
– ఎంసీ విజయానందరెడ్డి,
వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త


