రైతుల ఆవేదన చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుంది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. చంద్రబాబు హయంలోనే మామిడి రైతులు పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. 2018 తర్వాత మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోనే మామిడికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత జిల్లాలో మామిడి రైతుల కష్టాలు తెలిసి కూడా పట్టించుకోకపోవడం మన దారుణం.
– చెవిరెడ్డిమోహిత్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త
ఆదుకోకపోతే ఉద్యమం తప్పదు
మామిడి రైతుల ఆవేదన రోజురోజుకీ పెరిగిపోతోంది. రైతుల కన్నీటి సుడిలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం తథ్యం. వెంటనే ఆదుకోకపోతే ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. రైతుల ఆర్తనాదాలను పట్టించుకోవాలి.
– వల్లివేడు పృథ్వీరెడ్డి, జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిశీలకులు


